News Ticker

హన్సిక ప్రధాన పాత్రలో సి.కళ్యాణ్ కొత్త చిత్రం ‘చంద్రకళ’

‘చందమామ’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని అందించిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఇప్పుడు గ్లామర్‌ స్టార్‌ హన్సిక ప్రధాన పాత్రలో ‘చంద్రకళ’ అనే భారీ చిత్రాన్ని సి.కె. ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ బేనర్‌ పై సమర్పిస్తున్నారు. తమిళ్‌ లో సెన్సేషనల్‌ హిట్‌ అయిన ‘అరన్మణి’ చిత్రాన్ని  ‘చంద్రకళ’ పేరుతో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ బేనర్‌ పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ‘అరన్మణి’  తెలుగు రైట్స్‌ కోసం చాలామంది పోటీపడినప్పటికీ భారీ ఆఫర్‌ ఇచ్చి సి.కళ్యాణ్‌ స్వంతం చేసుకున్నారు.

ఈ చిత్రం గురించి సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ – ‘‘తమిళనాడులో ఇప్పటికే 24 కోట్లకుపై కలెక్ట్‌ చేసి సంచలన విజయం సాధించిన ‘అరన్మణి’  తెలుగులో చాలా పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకంతో ఫ్యాన్సీ ఆఫర్‌ ఇచ్చిన రైట్స్‌ తీసుకున్నాను. గ్రాఫిక్స్‌ కు ప్రాధాన్యత వుంటూ హార్రర్‌ టచ్‌ తో చాలా థ్రిల్లింగ్‌ గా సాగే మంచి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ ‘చంద్రకళ’. పూర్తిగా హైదరాబాద్‌ లోనే నిర్మించిన సినిమా ఇది. డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌ లో ఆడియో రిలీజ్‌ చేసి డిసెంబర్‌ మూడోవారంలో సినిమాని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. చందమామ తర్వాత మా బేనర్‌ లోఇది మరో సూపర్‌ హిట్‌ సినిమా అవుతుంది’’ అన్నారు.

హన్సిక, విమల్‌, లక్ష్మీరాయ్‌, ఆండ్రియా, సుందర్‌, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, సంతానం నటిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్‌కుమార్‌ ఫోటోగ్రఫీ పెద్ద ఎస్సెట్‌ అయింది. సి.కె. ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ నిర్మించిన ఈ భారీ చిత్రానికి పాటలు: వనమాలి, మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, సంగీతం: కార్తీక్‌ రాజా, భరద్వాజ్‌, ఫోటోగ్రఫీ: సెంథిల్‌ కుమార్‌, ఫైట్స్‌: దినేష్‌, డాన్స్‌: రాజుసుందరం, గాయత్రి రఘురాం, శివశంకర్‌, సహనిర్మాత: పద్మాకరరావు వాసిరెడ్డి, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, కథ-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: సుందర్‌ సి.

Leave a comment

Your email address will not be published.

*