News Ticker

హీరోవి అంటే నువ్వేనయ్యా బాలయ్యా…

ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా వుంటున్న బాలయ్య బాబు రియల్ లైఫ్‌లోనూ నిజంగానే హీరోవి అంటే నువ్వేనయ్యా అనిపించుకున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టినందుకు.. ఆ చిన్నారి తల్లిదండ్రులు అంటున్న మాటలివి. వివరాల్లోకెళ్తే.. మూడేళ్ల క్రితం బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్న 13 ఏళ్ల చిన్నారి, బాలకృష్ణ చైర్మన్‌గా వున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చేరింది. ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాగా ఖర్చవుతుందని తెలిపారు. కానీ ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఆ పాప తల్లిదండ్రుల వద్ద ఆమె వైద్యానికి అవసరమైనంత డబ్బుల్లేవు.

అయితే ఆనోటాఈనోటా ఈ విషయం బాలకృష్ణ వరకు వెళ్లింది. దీంతో ఆయనే ఆ కుటుంబానికి అండగా నిలిచారు. పాపకి  మూడేళ్లపాటు హాస్పిటల్లో ఉచిత వైద్యచికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయడంతోపాటు అవసరాల నిమిత్తం కొంత నగదు కూడా విరాళంగా అందజేశారట. ఈ మూడేళ్ల ట్రీట్‌మెంట్ తర్వాత ఆ చిన్నారికి ఇప్పుడు క్యాన్సర్ పూర్తిగా నయమైపోయింది. మా బిడ్డ బతికిందంటే, అందుకు ఆయన చలవే కారణం అంటున్నారు ఆ తల్లిదండ్రులు.

Leave a comment

Your email address will not be published.

*