News Ticker

టీచర్ ను చెప్పుతో కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే అనిత!

“గురు బ్రహ్మా, గురు విష్ణు, గురు దేవో భవ” అన్నారు పెద్దలు అయితే అలాంటి గురువును చెప్పుతో కొట్టింది ఓ అధికార ఎమ్మేల్యే వివరాలకు.. ఏపీలోని విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే అనిత ఓ పంతులుపై ఉగ్రరూపం చూపించింది. తనను ఎమ్మెల్యే అనిత నిర్భందించి చెప్పుతో కొట్టారని రామారావు అనే ఉపాధ్యాయుడు పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే అనితను అరెస్టు చేయాలని బాధితుని బంధువులు, సహచరులు పాయకరావుపేట పీఎస్ వద్ద ధర్నా చేస్తున్నారు. అనితతో పాటు ఎమ్మెల్యే పీఏ ప్రసాద్, ఎంపీటీసీ కాశీ విశ్వనాథ్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published.

*