News Ticker

మళ్లీ పడ్డావా నాయనా?

తన సినిమాలకు ఎలాంటి ఫలితం వచ్చిందన్నది పట్టించుకోకుండా.. తన పాటికి తాను సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతుంటాడు రామ్ గోపాల్ వర్మ. యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేడు. ఈ మధ్య మనోడి సినిమాలు విడుదలవుతున్న సంగతి కూడా జనాలకు గుర్తుండట్లేదు. గతంలో శాటిలైట్ రైట్స్ ఆశైనా ఉండేది కానీ.. ఇప్పుడా ఆశ కూడా కనిపించట్లేదు మనోడి సినిమాలకు. అయినా ‌వరుణ్‌తో సినిమాలు తీసే వాళ్లకు ఢోకా లేదు. ఎప్పట్నుంచో విడుదల కోసం ఎదురు చూస్తున్న ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాను అతి కష్టం మీద బయటికి వచ్చిన వరుణ్.. అంతలోనే మరో కొత్త సినిమా ట్రైలర్ వదిలాడు.వరుణ్ కొత్త సినిమా పేరు.. పడ్డానండి ప్రేమలో మరి. ఎప్పుడో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్‌వన్’ పాట పల్లవినే టైటిల్‌గా పెట్టి మహేష్ ఉప్పుటూరి అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తీశాడు. సైలెంటుగా సినిమా పూర్తి చేసి.. సడెన్‌గా ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశారు. ట్రైలర్ మరీ గొప్పగా ఏమీ లేదు. వరుణ్ వర్షంలో తడుస్తూ ఫుట్‌బాల్‌ను గట్టిగా తంతే.. అది వెళ్లి హీరోయిన్‌కు తాకుతుంది. వరుణ్ ఈ సీన్‌కు వ్యాఖ్యానం చెబుతూ.. ‘‘పడ్డాను.. పడిపోయాను’’ అంటాడు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో పరిచయమైన వితిక.. వరుణ్‌కు జంటగా నటిస్తోంది. ఇది కొత్త కాన్సెప్ట్‌ అని గొప్పగా చెబుతున్న వరుణ్‌కు ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Leave a comment

Your email address will not be published.

*