News Ticker

మంచు హీరోలు దుమ్ము రేపుతారట

‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలో మొత్తం మంచు హీరోలందరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో వారు ఆశించిన ఫలితం రాకపోయినా కానీ వారు చేసిన సినిమాల్లో ఈమధ్య కాలంలో కమర్షియల్‌గా ఫర్లేదనిపించుకున్నది ఆ చిత్రమే. ఫస్ట్‌ ఎటెంప్ట్‌లో హిట్‌ అవలేకపోయిన మంచు హీరోలు మరోసారి కలిసి నటించే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘దుమ్ము రేపుతాం’ అనే టైటిల్‌తో రూపొందే ఈ చిత్రంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ నటిస్తారు.మంచు లక్ష్మి కూడా ఒక కీలక పాత్ర చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా దర్శకుడు ఎవరనేది ఫిక్స్‌ కాలేదు. విష్ణుకి కలిసి వచ్చిన ‘డి’ సెంటిమెంట్‌కి తగ్గట్టుగా టైటిల్‌ డిసైడ్‌ చేసారు. కొందరు రచయితల బృందం కలిసి ఈ చిత్రం కోసం కథ సిద్ధం చేస్తున్నారు. ఈమధ్య మంచు హీరోలు తీసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ చిత్రానికి చాలా కేర్‌ తీసుకుంటున్నారు. ఈసారి తామంతా కలిసి చేసే ఎటెంప్ట్‌ గురి తప్పకూడదని గట్టిగా ఫిక్సయ్యారు.

Leave a comment

Your email address will not be published.

*