News Ticker

టికెట్ లేదని చితకకొట్టారు, ఒకరి మృతి

కర్నూలు : కర్నూలు జిల్లా డోన్ రైల్వేస్టేషన్లో  పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. టికెట్ లేని 13మంది ప్రయాణికులను పోలీసులు చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లుగా (29) గుర్తించారు. కాగా మృతుని భార్య రైల్వేస్టేషన్ బుకింగ్ హాల్ వద్ద ఆందోళనకు దిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published.

*