News Ticker

వైజాగ్ లో సింగపూర్ ఐటీ టవర్స్ నిర్మాణం

వైజాగ్‌ లో సింగపూర్‌ ప్రభుత్వ సహకారంతో ఐటీ టవర్స్‌ ను నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటీవల సింగపూర్‌ పర్యటన జరిపినప్పుడు తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదన ఇప్పుడు కార్యరూపంలోకి వస్తోంది. సింగపూర్‌ ప్రభుత్వ రంగ సంస్థ జురాంగ్‌ సహకారంతో ఈ ఐటీ టవర్స్‌ ను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై  ఆ సంస్థ అధికారులతో ప్రభుత్వం చర్చించింది. సంస్థ కూడా సానుకూలంగా స్పందించడంతో దీనికి అవసరమైన స్థల ఎంపికపై అధికారులు పరిశీలన జరుపుతున్నారు.

Leave a comment

Your email address will not be published.

*